పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా మే 9న రిలీజ్ కావాల్సిఉంది. అయితే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 9 నుంచి కొత్త రిలీజ్ డేట్ కు పోస్ట్ పోన్ చేయాలనే ఆలోచనలో మూవీ టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రిలీజ్ డేట్ పై ఇప్పుడొక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మే 30న కల్కి సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి మూవీ టీమ్ వచ్చారట. ఇదే డేట్ ను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎలక్షన్ హడావుడిలో సినిమా మే 9న రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పై తీవ్రమైన ప్రభావం పడుతుందని అనుకోవచ్చు.

మే 30 అయితే అప్పటికి ఎలక్షన్స్ కోలాహలం తగ్గిపోతుంది, సమ్మర్ హాలీడేస్ కలిసొచ్చినట్లు ఉంటుంది కాబట్టి ఆ డేట్ బెటర్ అనుకుంటున్నారట. ఇప్పటికైతే మూవీ టీమ్ మే 9 టార్గెట్ గానే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు. కల్కి 2898 ఎడి సినిమాను సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ అంశాలతో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్, దీపిక, దిశా పటానీ, మనోజ్ బాజ్ పాయ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉండటంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *