కన్నడ బ్యూటీ నభా నటేష్ నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభులో ఆఫర్ దక్కించుకుంది. ఈ సినిమాలో ఇప్పటికే సంయుక్తా మీనన్ ను హీరోయిన్ గా తీసుకోగా..ఇప్పుడు మరో హీరోయిన్ గా నభాను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది నభాకు మంచి ఆఫర్ అనుకోవచ్చు. భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీగా స్వయంభు తెరకెక్కుతోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం స్వయంభు రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో తెలుగులో బిజీ అయ్యింది నభా నటేష్. పలు బిగ్ మూవీస్ చేసినా ఆమెకు సక్సెస్ కంటిన్యూ కాలేదు. దీంతో టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుందీ భామ. ఇప్పుడు స్వయంభుతో ఆమెకు మంచి కమ్ బ్యాక్ దొరికిందని అనుకోవచ్చు.