పక్కా ప్లానింగ్ ఉన్న డైరెక్టర్స్ సినిమాను ఫాస్ట్ గా చేసేయగలరు. అలాంటి క్లారిటీతో యంగ్ డైరెక్టర్ వశిష్ట ఉన్నట్లు తెలుస్తోంది. బింబిసార హిట్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన ఆయన..ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 ప్రాజెక్ట్ చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కనుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం…అనుకున్న డేట్ కంటే చాలా ముందుగానే మెగా 157 సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ముందుగా ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ప్రీ ప్రొడక్షన్ మీద క్లారిటీ రావడంతో ఇంకా ముందుగానే ఈ ఏడాది చివరకే మూవీని స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట.

హై బడ్జెట్ తో, వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో, గ్రాఫిక్ హంగులతో మెగా 157 సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. ఈ సినిమా కోసం నయనతార, ఐశ్వర్యరాయ్ వంటి హీరోయిన్స్ ను అనుకుంటున్నారు. హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *