తన భారీ పాన్ ఇండియా లైనప్ కు డిఫరెంట్ గా ప్రభాస్ చేస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ డీలక్స్ రాజా. ఈ టైటిల్ చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి రూపొందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. డీలక్స్ రాజాలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తారట. అయితే టైటిల్ ఇదే ఉంటుందా కొత్త టైటిల్ ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఫన్ తో ఉంటుందని, సినిమాకు మూడు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు డైరెక్టర్ మారుతి చెబుతున్నారు.

త్వరలో ఈ సినిమా మూడో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇక ప్రభాస్ తన కొత్త సినిమా సలార్ తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *