kesineni_chinni_nomination_5572a

అభ్యర్థి ప్రకటన అనంతరం ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుండి నేటి వరకు దాదాపు 15 రోజులుగా చిన్ని ప్రవర్తనలో మార్పు టీడీపీ నాయకుల్లో విస్తు చెందుతుంది ఓ పక్కన అన్న వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఇప్పటికే రూరల్ ప్రాంతంలో రెండు సార్లు విస్తృత పర్యటన చేయగా ‘నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలున్నాయో నానికి తెలుసా’ అంటూ సవాల్ విసిరిన చిన్ని గ్రామాల్లోకి పోవడం లేదు. చిన్ని రోజువారీ ఎన్నికల పచ్రారం షెడ్యూల్ చూస్తున్న టీడీపీ శ్రేణులకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి .

వివరాల్లోకి వెళ్తే గత నెల 14 వ తేదీ నుండి చిన్ని పచ్రారం పూర్తిగా డీలా పడిందనేది కనిపిస్తున్న సత్యమే
ఏప్రిల్ 14 న, 18న మైలవరం అభ్యర్థి వసంత తో కనిపించిన చిన్ని మరో సారి మళ్ళీ మైలవరం ముఖం చూడలేదు. గత 20 రోజుల్లో 20 వ తేదీన నందిగామలో కనిపించిన కేశినేని చిన్ని మళ్ళీ అక్కడ ప్రచారంలో 10 రోజులు కనపడలేదు. 17 వ తేదీన జగ్గయ్య పేటలో ఓసారి అలా మెరిసినట్లు వచ్చి వెళ్లిపోయిన చిన్ని విజయవాడ తూర్పు లో 20 వ తేదీన చిన్ని కనిపించారు.

సెంట్రల్ నియోజకవర్గంలో కనీసం అడుగు పెట్టలేదు. 19 న కేశినేని చిన్ని తన నామినేషన్ తర్వాత తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ అభ్యర్థులు నామినేషన్ లలో కాసేపు కనిపించారు. చిన్ని నామినేషన్ కార్యక్రమంలో కనిపించని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎందుకిలా జరుగుతోంది. అయితే గత నెల రోజులుగా విజయవాడ పశ్చి మలో తన సోదరి, తనయుడు , తానూ కూడా వరుసగా పచ్రారం చేస్తూ
వస్తున్నారు.

పశ్చిమ కూటమి అభ్యర్ధితో కాకుండా తన దారిన తాను పచ్రారం చేసుకోవడం కూడా టీడీపీ శ్రేణులకు అర్థం కాని సమస్యగా ఉంది అక్కడ స్థానిక నాయకులు బుద్దామీరాలు కూడా చిన్ని తో కాకుండా సుజనా చౌదరితో ప్రచారంలో పాల్గొంటున్నారనేది మరో చర్చ.

ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది…చిన్ని ఆలోచన ఏమిటి??
విజయవాడ పశ్చిమలో మాత్రమే చిన్ని పచ్రారం ఎందుకు చేస్తున్నారు ??
మిగిలిన ఆరు నియోజకవర్గాల నాయకులకి చిన్నికిపోసగటం లేదా??
చిన్ని చేయించుకున్న సర్వే ఫలితాల్లో ఏముంది??
అసలు బరిలో ఉన్నా డా?? ఉన్నది పది రోజులు 280 గ్రామాలు 64 డివిజన్లు, 14 కొండ ప్రాంతాలు ఇంకెప్పుడు పచ్రారం చేస్తారోనని టీడీపీ శ్రేణుల ఎదురు చూపులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *