Ntv No.1 Channel: NTV తెలుగులో నంబర్ వన్ ఛానెల్‌గా తన తిరుగులేని బలాన్ని ప్రదర్శిస్తోంది. 24×7 వార్తల ప్రసారంతో, ఎల్లప్పుడూ వేగవంతమైన మరియు నిజమైన వార్తలు ప్రసారం చేయడంతో పాటు నిజాయితీ కలిగిన వార్తలను అందిస్తూ టాప్ స్థానానికి దూసుకెళ్లింది. మరోసారి ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్‌తో దూసుకుపోయింది. ఛానల్ ప్రారంభమైనప్పటి నుండి ప్రజాదరణ పొందింది. అందుకే ఛానల్ ను ప్రజలు ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.

గ్రామం నుండి పట్టణం వరకు ఖచ్చితమైన వార్తలు అందిస్తూ NTV చాలా ప్రజాదరణ అందుకుంటూ నెంబర్ వన్ స్థాయి కి దూసుకుపోతుంది. NTV ఎల్లప్పుడూ బ్రేకింగ్ న్యూస్‌లను అందిస్తూ మరియు ఎప్పుడూ లైవ్‌లో ఉండి రిపోర్ట్ చేయ‌డం, ఖ‌చ్చిత‌మైన స‌ర్వేల‌కు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవ‌లం త‌ప్పుడు ప్రచారాలు, అన‌వ‌స‌ర‌మైన సంచ‌నాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగ‌ల‌గ‌డం, ప్రజ‌లకు అవ‌స‌ర‌మైన విష‌యాల్ని వారి దగ్గర‌కు చేర్చడ‌మే అని న‌మ్మిన ఎన్టీవీకి ప్రజ‌లు నెం.1 స్థానాన్ని క‌ట్టబెట్టారు.

తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 66.5 టీఆర్పీల‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ”ప్రతి క్షణం-ప్రజా హితం” అనే స్లోగ‌న్‌ను పెట్టుకుని, కేవ‌లం దాన్ని స్లోగ‌న్‌గా వ‌దిలేయ‌కుండా ప్రతిక్షణం ఆ మాట‌ మీద ఉండ‌ట‌మే ఎన్టీవీ ఈ స్థానానికి రావ‌డానికి కార‌ణం. దేనికీ బెద‌ర‌కుండా, ఎవ‌ర్నీ బెదిరించ‌కుండా ప్రజ‌ల పక్షాన నిల‌బ‌డుతుండ‌ట‌మే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిల‌బెడుతుంది. కాగా, ఎన్టీవీ నెం.1గా నిల‌వ‌డంతో ఎన్టీవీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *