విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ స్క్రీన్స్ మీదకు రాబోతోంది. తెలుగుతో పాటు తమిళంలో ఫ్యామిలీ స్టార్ ను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఎంత క్రేజ్ ఉందో తమిళంలోనూ అంతే క్రేజ్ ఈ సినిమా పట్ల కనిపిస్తోంది. ఇది తమిళనాడు వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్న భారీ థియేటర్స్ లిస్టు చూస్తే తెలుస్తోంది.
తిరుచ్చీ, తంజావూర్, తిరునల్వేలి, కన్యాకుమారి, కోయంబత్తూరు, రామనాథపురం, మధురై, చెంగల్పట్టు, చెన్నై..ఇలా తమిళనాడులోని మెయిన్ సిటీస్ అన్నింటా పెద్ద సంఖ్యలో ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి రాబోతోంది. విజయ్ గత సినిమా ఖుషి కూడా తమిళనాట మంచి వసూళ్లు సాధించింది. మృణాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాను దిల్ రాజు , శిరీష్ నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందంచారు. రేపు ఈ సినిమా విడుదలవుతోంది.