అఖిల్ బర్త్ డే ఈ నెల 8న. అదే రోజు ఆయన నటించబోయే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేస్తారనే టాక్ మొదలైంది. ఇది అఖిల్ నటిస్తున్న 6వ సినిమా. ఆయన నటించిన గత ఐదు సినిమాల్లో ఏదీ సరైన సక్సెస్ అందుకోలేదు. గత సినిమా ఏజెంట్ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మరో భారీ మూవీకి అఖిల్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను సోషియో ఫాంటసీ కథతో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ రూపొందించబోతున్నారు.
యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమా సెటప్ భారీగా ఉంటుందని తెలుస్తోంది. నోటెడ్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమాకు పనిచేయబోతున్నారు. ఇది అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కానుంది. ఇన్ని ఫ్లాప్ మూవీస్ మధ్య అఖిల్ సినిమాకు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సబ్జెక్ట్ మీద నమ్మకంతోనే యూవీ సంస్థ ఈ రిస్క్ చేస్తున్నట్లు అనుకోవచ్చు.