హీరో నాని కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజైంది దసరా. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా తెలుగులో మంచి సక్సెస్ అయ్యింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాల్ ప్రొడక్షన్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించారు. కొత్త దర్శకుడైనా రివేంజ్ డ్రామాతో ఆకట్టుకున్నారు. దసరా సక్సెస్ తర్వాత శ్రీకాంత్ ఓదెల మళ్లీ నానితోనే సినిమా చేస్తున్నారు. వీళ్ల కాంబో సినిమాకు అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఈ సినిమాను ఫార్మల్ గా అనౌన్స్ చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. వచ్చే సమ్మర్ కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. నాని నటిస్తున్న 33వ సినిమా ఇది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ పై యూ డోంట్ నీడ్ ఐడెంటిడీ టు బీ లీడర్ అని క్యాప్షన్ రాశారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో పాటు సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.