సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్ బ్లాక్ బస్టర్ టిల్లు స్క్వేర్ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతోంది. దీనికి టిల్లు 3 అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నిన్నటి నుంచి టిల్లు స్క్వేర్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో సినిమా క్లైమాక్స్ చివరలో టిల్లు 3 అనే టైటిల్ కార్డ్ వేస్తున్నారు. డీజే టిల్లు వచ్చిన రెండేళ్లకు టిల్లు స్క్వేర్ రాగా..ఇప్పుడు మూడో సినిమాకు మరో రెండేళ్లు పట్టే అవకాశం కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

ఒకటి బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడక్షన్ లో కాగా..రెండోది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లో. ఈ రెండు సినిమాల తర్వాత టిల్లు 3 వర్క్స్ కు టైమ్ దొరకనుంది. మరోవైపు టిల్లు స్క్వేర్ సినిమా భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకు రెండు రోజుల్లోనే 45 కోట్ల రూపాయలకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ దక్కింది. ఓవర్సీస్ లోనూ టిల్లు స్క్వేర్ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. దాదాపు 2 మిలియన్ డాలర్స్ మార్క్ కు టచ్ కాబోతోందీ సినిమా. ఈ బిగినింగ్ చూస్తే టిల్లు స్క్వేర్ ఈ ఏడాది మరో బిగ్ హిట్ కానుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed