మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు వశిష్ట. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ సోషియో ఫాంటసీ సినిమా అయిన విశ్వంభరను రెగ్యులర్ షెడ్యూల్స్ లో కంప్లీట్ చేస్తూ తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు వశిష్ట. ఈ బిగ్ ప్రాజెక్ట్ ను నాన్ స్టాప్ షెడ్యూల్స్ లో చేస్తుండటం సినిమా సంక్రాంతి రిలీజ్ పై హోప్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి పాన్ ఇండియా మూవీస్ మేకింగ్ కోసం డైరెక్టర్స్ టైమ్ తీసుకుంటారు.
కానీ ఆపకుండా షూటింగ్ చేస్తూ వెళ్తుండటం వశిష్ట మూవీ మీద చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ బిగిన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోనే జరగనున్న ఈ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొంటున్న యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించనున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా చావ్లా, సురభి ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే జనవరి 10న సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed