పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి సినిమా పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు నెట్టింట చాలా రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. మే 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే దేశమంతటా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అందులో మే నెలలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మే 3న ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

అలాంటి ఎలక్షన్ ఫీవర్ ఉండే టైమ్ లో సినిమా విడుదల సరికాదనే నిర్ణయానికి మూవీ టీమ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సస్పెన్స్ కొనసాగిస్తున్నారు కల్కి మూవీ మేకర్స్. మే 9న విడుదల చేస్తారా లేదా అనేది అఫీషియల్ గా వెల్లడించడం లేదు. షూటింగ్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తూ వెళ్తున్నారు. అయితే కల్కి 2898 ఎడి సినిమా టీమ్ రిలీజ్ విషయంలో ఆల్రెడీ ఓ నిర్ణయం తీసుకున్నా బయటకు చెప్పడం లేదని టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed