స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాను చూడాలనుకునే ప్రేక్షకులు టికెట్ బుకింగ్ యాప్స్ ద్వారా తమ ఫేవరేట్ థియేటర్, మల్టీప్లెక్స్ లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. మరో ఆరు రోజుల్లో “ఫ్యామిలీ స్టార్” సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సమ్మర్ కు మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న ఈ సినిమా ఇప్పటికే కావాల్సినంత హైప్ క్రియేట్ అయ్యింది.

సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకం మూవీ టీమ్ లో కనిపిస్తోంది. ఆడియెన్స్ లోనూ ఫ్యామిలీ స్టార్ బాగుంటుందనే అంచనాకు వస్తున్నారు. ఈ క్రేజ్ టికెట్ బుకింగ్స్ లో రిఫ్లెక్ట్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి చాలాకాలం తర్వాత ఫ్యామిలీస్ అన్ని కదిలొచ్చి చూసే సినిమా ఫ్యామిలీ స్టార్ అవుతుందని ఆశించవచ్చు. ఈ సినిమా నుంచి రిలీజైన లిరికల్ సాంగ్స్, ట్రైలర్ బాగుండటం కూడా మూవీ మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ పెట్ల ఫ్యామిలీ స్టార్ సినిమాను రూపొందించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ తెరపైకి రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed