మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా గురువారం థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా అన్ని చోట్ల నుంచీ రెస్పాన్స్ తెచ్చుకుంది “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రాగా..ఇవాళ్టికి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్ లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చిందంటూ ప్రేక్షకులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed