త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇరవై ఏళ్లు దాటింది. ఇన్నేళ్లు ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండటం అరుదు. చాలా కొద్దిమంది హీరోయిన్స్ కే ఇది సాధ్యమవుతుంటుంది. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన జోడీగా నటిస్తూ కొత్త హీరోయిన్స్ కు పోటీనిస్తోంది త్రిష. ఇప్పుడున్న స్టేజ్ త్రిషకు హీరోయిన్ గా చివరిది అనుకోవచ్చు. మళ్లీ ఇంత ఫామ్ తనకు రాకపోవచ్చు. అందుకే ఉన్నప్పుడే సంపాదించుకునేందుకు రెడీ అవుతోంది త్రిష.

ఒక్కో సినిమాకు పది నుంచి పన్నెండు కోట్ల రూపాయల దాకా ఫీజు తీసుకుంటోందట. ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి విశ్వంభరతో పాట కమల్ హాసన్ థగ్ లైఫ్, మలయాళంలో ఓ సినిమా ఉన్నాయి. వీటితో పాటు విజయ్ నటిస్తున్న ది గోట్ సినిమాలోనూ ఓ కీ రోల్ చేస్తోంది. తను హీరోయిన్ గా చేస్తున్న సినిమాలన్నింటికీ కాస్త అటూ ఇటూగా ఇదే అమౌంట్ రెమ్యునరేషన్ గా అడుగుతోందట త్రిష. హీరోయిన్స్ కోటి తీసుకుంటేనే వింతగా చెప్పుకునే రోజుల నుంచి పదీ పన్నెండు కోట్ల దాకా వారి రెమ్యునరేషన్ చేరడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed