కాలేజ్ స్టూడెంట్ గా తన కొత్త సినిమాలో కనిపించబోతున్నారు సందీప్ కిషన్. కాలేజ్ బేస్డ్ యాక్షన్ డ్రామాలో ఆయన నటిస్తున్న సినిమాకు వైబ్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ జేఎస్ తెరకెక్కిస్తున్నారు. స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.
సందీప్ కిషన్ నటిస్తున్న 31వ సినిమా ఇది. ఇవాళ రిలీజ్ చేసిన వైబ్ ఫస్ట్ లుక్ లో హాకీ స్టిక్స్ పట్టుకుని తన ఫ్రెండ్స్ తో కలిసి ఫైట్ కు రెడీ అయిన సందీప్ కిషన్ ను చూపించారు. వచ్చే ఏడాది సమ్మర్ కు వైబ్ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇటీవల ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సందీప్ కిషన్. ఈ చిత్రంతో పాటు ఆయన ధనుష్ రాయన్ సినిమాలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు.