సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ మీద గట్టిగానే దాడి చేస్తోంది. ఈ సినిమా నిన్న రిలీజై ఓవరాల్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటికే సినిమా మీదున్న హైప్ తో బుకింగ్స్ బాగా జరిగాయి. ఇదంతా డే 1 కలెక్షన్స్ మీద క్లియర్ గా కనిపించింది. టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్స్ అదిరిపోయాయి. 23 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను ఒక్కరోజులోనే అందుకుందీ సినిమా.

యూత్ ఫుల్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ కావడంతో యూత్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా చూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత చెప్పినట్లు వంద కోట్ల వసూళ్లను టిల్లు అందుకోవడం పెద్ద కష్టమేం కాకపోవచ్చని తెలుస్తోంది. అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ డైరెక్షన్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. సితార సంస్థకు ఇటీవల వరుస ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యంలో టిల్లు సక్సెస్ ఈ సంస్థకు జోష్ నిచ్చింది అనుకోవచ్చు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *