నువ్వు నేను ఫేమ్ అనిత అప్పట్లో యూత్ ఆడియెన్స్ బాగా ఇష్టపడిన హీరోయిన్. కొన్ని సినిమాల తర్వాతే ఆమె ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయింది. నాగార్జున నటించిన నేనున్నాను సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అనిత టాలీవుడ్ వదిలి వెళ్లి చాలా కాలమవుతోంది. ఇటీవల కొన్ని హిందీ సీరియల్స్ లో నటించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరకు వస్తోందీ హీరోయిన్.

సుహాస్ హీరోగా రూపొందుతున్న ఓ భామ అయ్యో రామ సినిమాలో కీలక పాత్రలో అనిత కనిపించనుంది. ఇవాళ ఈ సినిమా ప్రారంభోత్సవంలో అనిత సందడి చేసింది. క్రీమ్ కలర్ తెల్ల చీరకట్టులో అందంగా కనిపించింది. కొద్దిగా లావు కావడం తప్ప నువ్వు నేను లో ఉన్నంత అందంగానే ఇప్పటికీ ఉంది అనిత. మంచి కథ, క్యారెక్టర్ ఉన్నందువల్లే ఈ సినిమాలో నటిస్తున్నట్లు అనిత తెలిపింది. ఓ భామ అయ్యో రామ సినిమాను కొత్త దర్శకుడు రామ్ గోదాల రూపొందిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *