అలుపన్నది తెలియకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. రీసెంట్ బ్లాక్ బస్టర్ యానిమల్ సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకు బ్రేక్ తీసుకోకుండా అటు పుష్ప 2 మూవీలో యాక్ట్ చేస్తోంది. ఇక తాజాగా తన కొత్త సినిమా ది గర్ల్ ఫ్రెండ్ సెట్ లో అడుగుపెట్టింది రశ్మిక. ఇవాళ్టి నుంచి ది గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ లో రశ్మిక జాయిన్ అయ్యింది.
20 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో రశ్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్నారని తెలుస్తోంది. రశ్మిక మందన్న లీడ్ రోల్ లో నటిస్తున్న వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రమిది. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను నిర్మిస్తున్నాయి. చిలసౌ సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.