స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమాలో గ్రాఫిక్స్ కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. రీసెంట్ గా ఓ ప్రోగ్రాంలో పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడారు.

తనకు గ్రాఫిక్స్ అంటే ఇష్టమని, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి వీఎఫ్ఎక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండేదని నాగ్ అశ్విన్ అన్నారు. తన కొత్త సినిమా కల్కి 2898 ఏడీ కోసం మొత్తం వీఎఫ్ఎక్స్ వర్క్ మేకిన్ ఇండియా టైప్ లో ఇండియాలోనే చేయాలని భావించామని నాగ్ అశ్విన్ చెప్పారు. అయితే విదేశీ కంపెనీలకు కంటెంట్ ఇవ్వక తప్పింది కాదన్న నాగ్ అశ్విన్…ఫ్యూచర్ లో మొత్తం వర్క్ ఇండియాలోనే చేసేలా కంపెనీస్ డెవలప్ అవుతున్నాయని చెప్పారు. కల్కి లో విజువల్ ఎఫెక్ట్స్ సర్ ప్రైజ్ చేస్తాయన్నారీ టాలెంటెడ్ డైరెక్టర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *