బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బర్త్ డేకు ఆయన కొత్త సినిమా డంకీ టీజర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. నిమిషం లోపు నిడివి గల ఈ టీజర్ తో సినిమా మీద ఆడియెన్స్ కు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్ కాబట్టి…సినిమా ఖచ్చితంగా ఒక క్లాసిక్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయితే డంకీ టీజర్ ఎలా ఉంటుందో అనే ఇంట్రెస్ట్ కూడా మూవీ లవర్స్ లో బాగా ఏర్పడుతోంది. షారుఖ్ బర్త్ డే వచ్చే నెల 2న సో అదే రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఇక షారుఖ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జవాన్ ఓటీటీ డేట్ ను కూడా అదే రోజు అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ జవాన్ కు సంబంధించిన కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. నవంబర్ 2న జవాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేందుకేే ఈ కౌంట్ డౌన్ మొదలైందని అనుకోవచ్చు. పఠాన్, జవాన్ వంటి బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల గ్రాసింగ్ మూవీస్ తో షారుఖ్ తన సూపర్ ఫామ్ లోకి వచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *