పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో హ్యూజ్ సెట్ క్రియేట్ చేశారు. ఈ సెట్ లోనే ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరిస్తారట.

ఇక ఈ భారీ యాక్షన్ సీక్వెన్సులు ఇంటర్వెల్ సీన్స్ కోసమని టాక్ వినిపిస్తోంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బిగ్ స్కేల్ లో ఉండేలా మారుతి ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను హారర్ ఎంటర్ టైనర్ గా చెబుతున్నా…సినిమాలో ప్రభాస్ ఇమేజ్ కు తగినట్లు గ్రాండ్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. మారుతి, ప్రభాస్ సినిమా నుంచి అఫీషియల్ అప్ డేట్ త్వరలో రిలీజ్ చేస్తారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *