హీరో వరుణ్ తేజ్ పెళ్లి సందడి మొదలైంది. ఇటలీలో లావణ్య త్రిపాఠీ, వరుణ్ తేజ్ వివాహం రేపు జరగనుంది. పెళ్లి కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. నిన్న రాత్రి జరిగిన కాక్ టెయిల్ పార్టీలో మెగా కుటుంబ సభ్యులు పాల్గొని సందడి చేశారు. హీరో రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, సాయి ధరమ్ తేజ్…ఇతర కుటుంబ సభ్యులు వరుణ్ వెడ్డింగ్ పార్టీలో పాల్గొని సందడి చేశారు.

రేపు జరగనున్న వరుణ్, లావణ్య పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరుగుతున్న ఈ పెళ్లికి మూడు రోజుల పాటు వేడుకలు చేయబోతున్నారు. హైదరాబాద్ తిరిగి వచ్చాక ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *