నితిన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్ రిలీజైంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రాజశేఖర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. డిసెంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లో జూనియర్ ఆర్టిస్టుగా నితిన్ నటించాడు. బాహుబలిలో ఆరో లైన్ లో ఏడో వాడిగా నితిన్ కనిపిస్తాడు. పేరుకు జూనియర్ ఆర్టిస్ట్ అయినా..టీజర్ లోని మిగతా సీన్స్ అన్నీ ఆ కథకు సంబంధం లేకుండానే కమర్షయిల్ గా ఫైట్స్, లవ్ సీన్స్, పాటలతో సాగాయి. జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లోని ఫన్ ను ఉపయోగించుకునేందుకే ఈ లైన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను చేసినట్లు టీజర్ వాయిస్ ఓవర్ లో ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. సినిమా మీద ఒక కన్ క్లూజన్ రాలేకుండా టీజర్ కట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *