బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బాలీవుడ్ హంగామా వెబ్ సైట్ పై మండిపడ్డారు. అబద్ధాలు తప్ప ఇంకే రాయరా అంటూ ఫైర్ అయ్యారు. అక్షయ్ కుమార్ మళ్లీ పాన్ మసాలా యాడ్ చేస్తున్నారంటూ ఆ వెబ్ సైట్ రాసింది. దాంట్లో అక్షయ్ ను పాన్ మసాలా అంబాసిడర్ అంటూ పేర్కొంది. ఈ పోస్ట్ పై అక్షయ్ కు మండినట్లుంది. ఆ యాడ్ రెండేళ్ల కిందట చేసిందంటూ కౌంటర్ ఇచ్చాడు.

అక్షయ్ స్పందిస్తూ – పాన్ మసాలా అంబాసిడర్ గా తిరిగి వస్తున్నానా…బాలీవుడ్ హంగామా సైట్ కు ఫేక్ న్యూస్ తప్ప మరో వార్తలు తెలియవేమో. ఆ యాడ్ షూట్ చేసింది 2021 అక్టోబర్ లో. నేను ఇటీవల చెప్పినట్లు పాన్ మసాలా యాడ్స్ చేయడం లేదు. కానీ ముందస్తు ఒప్పందం ప్రకారం ఈ నెలాఖరు వరకు వాళ్లు యాడ్స్ ప్రసారం చేసుకుంటారు. వాస్తవాలు రాయండి అంటూ ఆగ్రహించారు. మీడియా విషయంలో సంయమనం పాటించే అక్షయ్ ఇలా ఫైర్ అవడం నెటిజన్స్ ను సర్ ప్రైజ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *