న్యూ అండ్ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న మైక్ మూవీస్ సంస్థకు సపోర్ట్ చేసేందుకు నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఇటీవల స్లమ్ డాగ్ హజ్బెండ్ సాంగ్ రిలీజ్ చేశారు నాగార్జున. ఇప్పుడు మైక్ మూవీస్ కొత్త సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. రేపు సాయంత్రం 5.04 నిమిషాలకు ఈ స్టార్ హీరో చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కానుంది.
సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఒక యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. మైక్ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.