మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యే లోపు చేయలని నిర్ణయించుకున్నారట. అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మా బిల్డింగ్ ముఖ్యమైనది. బిల్డింగ్ కట్టడం అనేది ఇప్పట్లో అయ్యేది కాదని.. ఈ విషయాన్ని పక్కనపెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం గురించి సినీ నటుడు నరేష్ ను మీడియా అడిగితే.. దీని గురించి మంచు విష్ణు చెప్పాలన్నారు.

ఇక అసలు విషయానికి వస్తే.. వచ్చే ఎన్నికల్లో మంచు విష్ణు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారట. అయితే.. ఏకగ్రీవంగా తనని ఎన్నుకుంటే మాత్రం చేస్తాన్నారట కానీ.. పోటీ మాత్రం చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఈ సంవత్సరం సెప్టెంబర్ లో ఎన్నికలు జరిగాలి కానీ.. అసోసియేషన్ ఆడిట్ సమస్యల కారణంగా వచ్చే సంవత్సరం మేలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారట. మే లోపు మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *