సమంత రెండు సినిమాలు విడుదల అవుతున్నాయా!!

విడాకుల తర్వాత వరుస సినిమాలు చేయాలనే నేపథ్యంలో సమంత వచ్చిన సినిమా ను వచ్చినట్లుగా ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో క్షణం తీరిక లేని షెడ్యూళ్ల తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే ఆమె రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడంతో పాటు హిందీ సినిమాలతో భారీ షెడ్యూళ్లను కలిగి ఉంది.

ఈ నేపథ్యంలో ఆమె నుంచి ఇప్పుడు కొన్ని సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇంతలోనే కొన్ని వారాల పాటు అమెరికా ట్రిప్ వెళ్లి సర్ ప్రైజ్ చేసింది. తాను అమెరికా నుంచి తిరిగి రాగానే అటు రాజ్ అండ్ డీకేతో ప్రాజెక్ట్ ని పూర్తి చేయాల్సి ఉంటుందని.. ఇతర తెలుగు పెండింగ్ ప్రాజెక్టులను త్వరత్వరగా పూర్తి చేయాల్సి ఉంటుందని టాక్ వినిపించింది.

ఇకపోతే ఆమె హీరోయిన్ గా చేసిన రెండు సినిమాలు ఇప్పుడు విడుదల కి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ఆమె చేసిన యశోద సినిమా యొక్క విడుదల కు రంగం సిద్ధం చేసింది. నవంబర్ 11 వ తేదీన ఈ సినిమా విడులా అవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఆమె నటించిన మైథలాజిల్ చిత్రం శాకుంతలం సినిమా కూడా విడుదల కు సిద్ధమవుతుంది. డిసెంబర్ లో ఆ సినిమా ను విడుదల చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *