ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో స్టెప్పులేసి అదరగొట్టిన చిరంజీవి ఇప్పుడు మరో హీరో తో కలిసి స్టెప్పులేయనున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి సవతి తల్లి కొడుకు పాత్రలో రవితేజ కనిపించనున్నాడని అంటున్నారు.

ఇంటర్వెల్ బ్యాంగ్ రవితేజ ఎంట్రీ పై ఉంటుందని చెబుతున్నారు. చిరంజీవిని సపోర్టు చేసే ఈ పాత్రలో రవితేజ నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. చిరూ – రవితేజ కాంబినేషన్లో ఒక మాస్ మసాలా సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. ఈ పాటలో వీరిద్దరూ కలిసి చేయబోయే స్టెప్పులు అదిరిపోతాయట. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, కేథరిన్ .. రాజేంద్ర ప్రసాద్ .. వెన్నెల కిశోర్ .. బాబీ సింహా ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *