స్టార్ హీరో ప్రభాస్ కొత్త సినిమా సలార్ యూఎస్ బుకింగ్స్ లో రికార్డ్ దిశగా వెళ్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవగా..అక్కడ 4 లక్షల డాలర్ల మేర టికెట్స్ అమ్ముడయ్యాయి. ఈ స్పీడ్ 5 లక్షల డాలర్స్ కు చేరుతోంది. అంటే హాఫ్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ప్రీ టికెట్ బుకింగ్స్ లోనే సలార్ రాబట్టింది. గతంలో సెప్టెంబర్ రిలీజ్ అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ మార్క్ హాఫ్ మిలియన్ దాటి.మిలియన్ వైపు పరుగులు పెట్టింది.

డిసెంబర్ 22న రిలీజ్ కాబట్టి…ఇప్పుడున్న హాఫ్ మిలియన్..మిలియన్ మార్క్ టచ్ అయినా ఆశ్చర్యం లేదు. యూఎస్ సహా ఓవర్సీస్ లో ఒక రోజు ముందే డిసెంబర్ 21న సలార్ షోస్ పడుతున్నాయి. ప్రపంచంలోని దాదాపు అన్ని ఖండాల్లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాగా సలార్ రికార్డ్ సృష్టించనుంది. మన దగ్గర ఈ నెల 15వ తేదీ నుంచి సలార్ టికెట్ బుకింగ్స్ ప్రారంభమవుతాయి. అదే తేదీన సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సలార్ ట్రైలర్ వ్యూస్ లో రికార్డులు సృష్టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *