అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటిదాకా దాదాపు 70 శాతం దాకా పూర్తయ్యిందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ టార్గెట్ డేట్ కు అనుగుణంగా షూటింగ్ స్పీడప్ చేశారు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ తో పాటు ఓ సాంగ్ షూటింగ్ కూడా చేస్తున్నారట. ఈ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

పుష్ప సినిమాకు వచ్చిన అవార్డులు, రివార్డుల నేపథ్యంలో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఏర్పడిన ఈ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో భారీ మేకింగ్ తో పుష్ప 2 రూపొందిస్తున్నారు దర్శకుడు సుకుమార్. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్ తో కలిసి నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *