సీతారామం సినిమా సక్సెస్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. వరుసగా పేరున్న హీరోలతో నటించే అవకాశాలు అందుకుంటోంది. ఆమె హీరో నానితో కలిసి నటించిన హాయ్ నాన్న సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా మీద బాగా హోప్స్ పెట్టుకుంది మృణాల్. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో మృణాల్ తన కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతోంది.

తెలుగుతో పాటు హిందీలో బిజీగా ఉన్నానని చెప్పింది మృణాల్. తక్కువ టైమ్ లో తెలుగులో మంచి గుర్తింపు రావడం హ్యాపీగా ఉందని తెలిపింది. ఈ మధ్య హీరోయిన్స్ వెబ్ సిరీస్ లు చేస్తున్నారని ..అయితే తనకు వెబ్ సిరీస్ ల మీద అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. వెబ్ సిరీస్ చేయడం సుదీర్ఘమైన ప్రాసెస్ అని, వెబ్ సిరీస్ చేసేప్పుడు భాష బాగా తెలిసి ఉండాలని అంది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు షూటింగ్ జరుగుతోందని, తెలుగులో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నానని తెలిపింది మృణాల్ ఠాకూర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *