అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా నుంచి మాస్ జాతర అనౌన్స్ మెంట్ కు టైమ్ ఫిక్స్ చేశారు. ఈ సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 8వ తేదీన అల్లు అర్జున్ బర్త్ డే. ఆ రోజున పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ సాయంత్రం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ ఉండకపోవచ్చు. ఆగస్టు 15నే రిలీజ్ చేస్తున్నట్లు తాజా అప్డేట్ లోనూ మేకర్స్ వెల్లడించారు. పుష్ప 2 నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ అనౌన్స్ మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుష్ప సీక్వెల్ గా పుష్ప 2ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమా డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. మూవీ టీమ్ మాత్రం ఆగస్టు 15నే ఫిక్స్ అయ్యారు. రశ్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్ టికెట్ మూవీగా పుష్ప 2 పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *