బిగ్ బాస్ ఫేమ్ దివి విద్యాత హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ డ్రామా లంబసింగి. ఈ సినిమాలో భరత్ రాజ్ కీ రోల్ చేశారు. వంశీరాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన లంబసింగి సినిమా గత నెల 15వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఇవాళ్టి నుంచి లంబసింగి స్ట్రీమింగ్ అవుతోంది.

నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఓ మహిళా నక్సలైట్ ను పోలీసు కానిస్టేబుల్ ప్రేమించడం వారి ప్రేమకు సిద్ధాంతాలు, వారు ఎన్నుకున్న విభిన్న దారులు అడ్డొస్తాయి. నక్సలిజం నేపథ్యంలో ప్రేమ కథను తెరకెక్కించడం కొత్త ఆలోచన అనుకోవాలి. ఈ కథను ఆకట్టుకునేలా రూపొందించారు దర్శకుడు నవీన్ గాంధీ. థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలోనూ ఆదరణ పొందేలా కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *