హిట్ సినిమా పడితే ప్రేక్షకులు చూసేందుకు ఎంతగా రెడీగా ఉన్నారు అని చెప్పేందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ సినిమా. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. మూడు రోజుల్లోనే టిల్లు స్క్వేర్ సినిమాకు 68 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటోందీ సినిమా. ఫస్ట్ వీకెండ్ లోపే ఈ సినిమా పెట్టుబడి రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
చాలా స్పీడ్ గా లాభాల్లోకి టిల్లు స్క్వేర్ వచ్చేస్తున్నట్లే అనుకోవాలి. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు మల్లిక్ రామ్ రూపొందించిన టిల్లు స్క్వేర్ సినిమాలో ఫన్, రొమాన్స్, టిల్లు క్యారెక్టరైజేషన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా సితార సంస్థకు మంచి సక్సెస్ ఇచ్చింది. ఈ జోరులో టిల్లు స్క్వేర్ సినిమాకు సీక్వెల్ టిల్లు 3ను కూడా అనౌన్స్ చేశారు.