ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. నిన్న రాత్రి గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రేవేట్ ఆస్పత్రికి ఆయనను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డేనియల్ బాలాజీ కన్నుమూశారు. ఇవాళ పురసైవాల్కంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వడ చెన్నై, మాయవన్ సినిమాలతో కోలీవుడ్ లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు డేనియల్ బాలాజీ.

తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగశీష్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియల్స్ లోనూ నటించారీ యాక్టర్. ఓ సీరియల్ లో డేనియల్ అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకోవడంతో బాలాజీగా ఉన్న అతని పేరు డేనియల్ బాలాజీగా మారింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సినీ రంగ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *