లేడీ గెటప్ లో హీరోలు మెప్పించడం సినిమాల్లో కొత్తేం కాదు. ఇటీవల డ్రీమ్ గర్ల్ సినిమాలతో ఆయుశ్మాన్ ఖురానా బాలీవుడ్ లో మంచి సక్సెస్ లు అందుకున్నాడు. ఇలాంటి ప్రయత్నమే హీరో విశ్వక్ సేన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా లైలా అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో విశ్వక్ సేన్ ఇన్ అండ్ యాస్ లైలా అని ప్రకటించారు. అంటే విశ్వక్ సేన్ లైలా క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో లిప్స్ స్టిక్ తోపాటు కత్తిని, గన్ ను కూడా చూపించారు. దీంతో ఇదొక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అనుకోవచ్చు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మిస్తోంది. బట్టల రామస్వామి అనే సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ నారాయణ రూపొందిస్తున్నారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల గామితో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ కు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్వరలో రిలీజ్ కు ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *