ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసివాడే గొప్పోడు అని త్రివిక్రమ్ డైలాగ్ రాశారు పవన్ సినిమాలో. ఈ డైలాగ్ ను రాయకున్నా..ఇదే ఫార్ములాతో తన సినిమాలను రూపొందిస్తుంటారు డైరెక్టర్ పరశురామ్. ఎగ్జాంపుల్ గా గీత గోవిందం చూస్తే..హీరోయిన్ హీరోను సినిమాలో మూడొంతులు అనుమానిస్తూనే, తిడుతూనే ఉంటుంది. కానీ మనసులో ప్రేమిస్తుంది. హీరోకు చెప్పకుండా అతన్ని ఆరాధిస్తుంది. హీరో మీద ప్రేక్షకులకు జాలి కలుగుతుంది. అతని హీరోయిజం మీద ప్రేక్షకులకూ ప్రేమ ఏర్పడుతుంది. ఇలా హీరోలను తగ్గించి నెగ్గించే దర్శకుడు పరశురామ్ పెట్ల.

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ లో నీకు కోపం ఉంటే కొట్టవే బాబు అని హీరో అంటే..వెంటనే చెంప దెబ్బ కొడుతుంది హీరోయిన్ మృణాల్. ఇక్కడ హీరోను తగ్గించాడు పరశురామ్ కానీ థియేటర్ లో తప్పకుండా నెగ్గిస్తాడు. హీరోయిన్ కొట్టగానే హీరో గొప్పదనం ఏమీ పోదు. పైగా ప్రేక్షకులకు అతని మీద ఇష్టం ఏర్పడుతుంది. కూల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను రూపొందించి అందులో హీరో క్యారెక్టరేజేషన్ ను స్పెషల్ గా డిజైన్ చేయడం డైరెక్టర్ గా పరశురామ్ బలం. ఇది ఫ్యామిలీ స్టార్ లోనూ హండ్రెడ్ పర్సెంట్ చేసి ఉంటాడని ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ రిలీజ్ రోజు ఆయన మాటల్లోని కాన్ఫిడెంట్ లోనూ అర్థమైంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ థియేటర్స్ లోకి వస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *