మూడు ఫ్లాప్ ల తర్వాత హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ రూపంలో ఓ సక్సెస్ దక్కింది. ఇవాళ రిలీజైన టిల్లు స్క్వేర్ సినిమాకు అన్ని చోట్ల నుంచీ సక్సెస్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ హీరోయిన్ కు ఓ సూపర్ హిట్ ఖాతాలో పడినట్లే అనుకోవాలి. కార్తికేయ 2 సినిమా సక్సెస్ తర్వాత హిట్ కోసం ఎదురుచూసింది అనుపమ. 18 పేజెస్, బటర్ ఫ్లై, ఈగిల్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మరోసారి అనుపమకు బ్యాడ్ సీజన్ నడుస్తోందని అనుకున్నారు.

ఆమె కెరీర్ లో ఒక సక్సెస్ తర్వాత నాలుగైదు ఫ్లాప్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన టిల్లు స్క్వేర్ పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. ఈ సినిమాలో లిల్లీగా అనుపమ నటన, గ్లామర్, రొమాంటిక్ సీన్స్ యూత్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. సింగిల్ లైన్ లో టిల్లు చెప్పే ఫన్నీ డైలాగ్స్ సినిమాకే హైలైట్ అంటూ రెస్పాన్స్ వస్తోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *