రజినీకాంత్ హీరోగా నటిస్తున్న 171వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించనున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాచీలను చేతులకు బేడీల్లా వేసుకున్న రజినీకాంత్ స్టిల్ తో ఈ పోస్టర్ ఉంది. ఈ సినిమా టైటిల్ ను ఏప్రిల్ 22న రివీల్ చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలిపారు.

ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో క్రైమ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ రూపొందించి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ లోకేష్. రజినీకాంత్ ను ఓ కొత్త కథలో ఆయన ప్రెజెంట్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ తన 170వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కేజీ జ్ఞానవేల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక లోకేష్ సినిమా బిగిన్ చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *