కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. పలు హిట్ సినిమాలను రూపొందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో సూర్య సినిమా చేయబోతున్నారు. ఇది సూర్య నటించనున్న 44వ సినిమా. ఈ సినిమాను సూర్య సొంత ప్రొడక్షన్ 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు స్టోన్ బెంచ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పోస్టర్ ను రివీల్ చేస్తూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు సూర్య.
ఇది కొత్త ఆరంభం. మీ గుడ్ విశెస్ కావాలి అంటూ సూర్య ట్వీట్ చేశారు. సూర్య 44 పోస్టర్ లో లవ్, లాటర్, వార్ అనే క్యాప్షన్స్ ఉన్నాయి. దీంతో ఈ సినిమా లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. సూర్య సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా హోల్డ్ లో పడటంతో ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొచ్చారు. సూర్య భారీ పాన్ ఇండియా మూవీ కంగువ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.