విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ నిన్న రిలీజైంది. ఈ సినిమా ట్రైలర్ డిజిటల్ వ్యూస్ లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ కు ఇప్పటికే 15 మిలియన్ వ్యూస్ దక్కాయి. ట్రైలర్ లో విజయ్ చెప్పిన డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, మృణాల్ తో విజయ్ లవ్ ట్రాక్, ఫైట్ సీక్వెన్సులు ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ సూపర్ హిట్టయ్యింది.
ట్రైలర్ కు కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ రావడం సినిమా మీద మరింత హైప్ పెంచుతోంది. ఓపెనింగ్స్ మీద కూడా ట్రైలర్ సక్సెస్ ప్రభావం చూపించనుంది. ఈ సినిమాలో డైరెక్టర్ పరశురామ్ మేకింగ్ స్టైల్ క్లియర్ గా కనిపించింది. “ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.