విజయ్ దేవరకొండ హీరోగా తాను నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమా నిర్మించిన సంతోషం ఆయనలో కనిపిస్తోంది. కలెక్షన్స్ ద్వారా వచ్చే డబ్బు కంటే సక్సెస్ అనే మాట తనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందని గతంలో ఎన్నోసార్లు దిల్ రాజు చెప్పారు. ఫ్యామిలీ స్టార్ తో అలాంటి సంతోషాన్నే ఆయన ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దక్కుతుందని ఆశిస్తున్నారు. ఇవాళ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ను మూసాపేట శ్రీరాములు థియేటర్ లో విజయ్ ఫ్యాన్, ప్రేక్షకుల సందడి మధ్య రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దిల్ రాజుతో పాటు దర్శకుడు పరశురామ్ పాల్గొన్నాడు. ఈ సినిమా కొన్నేళ్ల పాటు తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుందని, విజయ్, మృణాల్ క్యారెక్టర్స్ ప్రేక్షకుల మనసులో చాలాకాలం ఉండిపోతాయని పరశురామ్ అన్నాడు. నిర్మాత దిల్ రాజు సమ్మర్ బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నామని, ఫ్యామిలీ స్టార్ చూస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులూ ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. యూనివర్సల్ పాయింట్ తో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో ఫన్, ఎమోషన్, హీరోయిజం, లవ్, యాక్షన్ అన్నీ ఉంటాయని దిల్ రాజు అన్నారు. 21 ఏళ్ల కిందట ఏప్రిల్ 5న దిల్ సినిమా రిలీజైన రోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కావడం తనకెంతో స్పెషల్ అని దిల్ రాజు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *