మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను తెలుగులో డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ రిలీజ్ చేశారు. గత నెల 10వ తేదీన “ట్రూ లవర్” సినిమా థియేటర్స్ లో రిలీజైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్రీమియర్ కు వచ్చేసింది.

డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో “ట్రూ లవర్” స్ట్రీమింగ్ అవుతోంది. ఒక జంట మధ్య ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితుల వల్ల ఒక ప్రేమికుడు తన ప్రేమను కాపాడుకునేందుకు ఏం చేశాడు అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాను హార్ట్ టచింగ్ గా తెరకెక్కించారు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్. ప్రేమికులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది కాబట్టి ఓటీటీలో వాళ్లు ఎక్కువగా చూసే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *