ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రేపు గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ ట్రైలర్ ను తెలంగాణలో ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మూసాపేట శ్రీరాములు థియేటర్ లో , ఏపీలో తిరుపతి పిజిఆర్ సినిమాస్ థియేటర్ లో సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి మధ్య ట్రైలర్ రిలీజ్ చేసి స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఓ స్పెషల్ పోస్టర్ తో ట్రైలర్ రిలీజ్ టైమ్ అండ్ ప్లేస్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

ఈ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ స్టిల్ ఆసక్తికరంగా ఉంది. ఇప్పటిదాకా ఫ్యామిలీ స్టార్ నుంచి రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ స్టిల్స్, పోస్టర్స్ అతన్ని ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ గా, ఫ్యామిలీ మంచి కోసం ఆలోచించే వ్యక్తిగా చూపించారు. టీజర్ లోనూ అదే ఉంది. ఇక ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లో మాత్రం యూఎస్ లోని అందమైన లొకేషన్ లో లగ్జరీ కారు పక్కన విజయ్ దేవరకొండ స్టైల్ గా నడిచివస్తున్న లుక్ రిలీజ్ చేశారు. యూఎస్ లో ఈ సినిమా కొంత పార్ట్ షూట్ చేశారు. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టార్ అమెరికా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కథలో ఆసక్తికరంగా ఉండనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *