పృథ్వీరాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ సినిమాకు తన ప్రశంసలు అందించారు లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్. డైరెక్టర్ మణిరత్నంతో కలిసి కమల్ హాసన్ ఈ సినిమాను చూశారు. సినిమా ప్రివ్యూ అనంతరం తన రెస్పాన్స్ తెలిపారు కమల్ హాసన్. ది గోట్ లైఫ్ లాంటి గొప్ప సినిమాను తీసిన డైరెక్టర్ బ్లెస్సీకి అభినందనలు తెలియజేశారు. మణిరత్నం కూడా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోయినట్లు కమల్ హాసన్ చెప్పారు.

ఇక హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటన చూసి తాను షాక్ అయ్యానని కమల్ హాసన్ అన్నారు. ఎంతో కష్టపడితే గానీ ఇలాంటి సినిమాలో నటించడం సాధ్యం కాదని చెప్పాడు. కెమెరామెన్ పనితనం అద్భుతంగా ఉందని ప్రశంసించారు కమల్. ఇలాంటి సినిమాకు తప్పకుండా ప్రేక్షకుల సపోర్ట్ ఉండాలని కోరారు. కమల్ హాసన్ ప్రశంసలపై హీరో పృథ్వీరాజ్ స్పందిస్తూ ది గోట్ లైఫ్ సినిమాకు దక్కిన గొప్ప అవార్డ్ ఇదేనంటూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *