రామ్ చరణ్ బర్త్ డే ఇవాళ. సోషల్ మీడియాలో ఆయనకు బర్త్ డే విశెస్ వెల్లువెత్తుతున్నాయి. స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అభిమానులు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ ఛేంజర్ నుంచి స్పెషల్ గిఫ్ట్ అందింది. అదే జరగండి లిరికల్ సాంగ్ రిలీజ్. గేమ్ ఛేంజర్ నుంచి అప్డేట్స్ కోరుతున్న ఫ్యాన్స్ కు, హీరో రామ్ చరణ్ కు ఇదే పెద్ద బహుమతి అనుకోవాలి.

తమన్ మ్యూజిక్ ఇచ్చిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, దలేర్ మెహంది, సునీధి చౌహన్ పాడారు. ఈ పాట కియారా, చరణ్ మధ్య తెరకెక్కించిన మంచి మాస్ బీట్ తో ఉండి ఆకట్టుకుంటోంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఈ పొలిటికల్ డ్రామా సినిమాను త్వరలో థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *