రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు రణ్ బీర్ కపూర్. ఈ సినిమా మీద ఎన్ని విమర్శలు వచ్చినా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఓటీటీలోనూ సూపర్ హిట్టయ్యింది. ఇక ఈ ప్రాజెక్ట్ సక్సెస్ మూడు నుంచి బయటకు వచ్చిన తన కొత్త సినిమా రామాయణం కోసం రెడీ అవుతున్నాడు రణ్ బీర్. ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. ఇందుకోసం విలువిద్యలు నేర్చుకుంటున్నారు.

కోచ్ తో కలిసి బాణాలు వేయడంలో శిక్షణ తీసుకుంటున్న రణ్ బీర్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను దర్శకుడు నితేశ్ తివారీ రూపొందించనున్నారు. ఏప్రిల్ లో అఫీషియల్ గా ఈ సినిమాను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. ఆదిపురుష్ తర్వాత బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా వస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఇదే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *