రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమా రిలీజై ఇవాళ్టికి 20 ఏళ్లవుతోంది. ఈ సినిమాను లక్ష్మీ ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు శ్రీను వైట్ల రూపొందించాడు. స్నేహ హీరోయిన్ గా నటించింది. వెంకీ సినిమా థియేటర్స్ లో ఎంత సూపర్ హిట్టైందో. టీవీ టెలికాస్ట్ అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా ఎప్పుడు టెలికాస్ట్ అయినా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. వెంకీ 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ సినిమా పోస్టర్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మీమ్స్ నవ్విస్తున్నాయి.

జాతకాలు నమ్మే ఓ యువకుడు అనుకోకుండా పోలీసు కావడం, హీరోయిన్ తండ్రి హత్య కేసులో నిందితులైన తన డిపార్ట్ మెంట్ లోని ఓ అధికారిణి పట్టుకోవడం, తను కోరుకున్న అమ్మాయిని ప్రేమించి సొంతం చేసుకోవడం స్థూలంగా వెంకీ కథ. అయితే ఇందులో అనేక కామెడీ క్యారెక్టర్స్ తో ఎంటర్ టైనింగ్ మూవీ చేశాడు శ్రీను వైట్ల. బొక్కగా బ్రహ్మానందం, గజాలాగా ఏవీఎస్, రవితేజ ఫ్రెండ్స్ శ్రీనివాస రెడ్డి, చిత్ర శ్రీను, టికెట్ కలెక్టర్ వేణు మాధవ్ లు ట్రైన్ ఎపిసోడ్ లో చేసే కామెడీ హంగామా ఇప్పటికీ నవ్విస్తుంటుంది. వెంకీ నుంచి వచ్చిన ట్రోల్స్, మీమ్స్ కు లెక్కే లేదు. ఇంతమంచి సినిమా కాస్ట్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ గా ప్రొడ్యూసర్ కు నష్టం తేవడమే నమ్మలేని కొసమెరుపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *