ఈ వీక్ టాలీవుడ్ బాక్సాఫీస్ లో రెండు భిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ ఈ ఫ్రైడే రిలీజ్ కు వస్తుండగా..మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఒక రోజు ముందుగానే గురువారం రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల్లో ”ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)” ఒక డిఫరెంట్ మూవీగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఓటీటీల్లో మలయాళ సినిమాలను చూస్తున్న మన ఆడియెన్స్ వాటిని బాగా ఇష్టపడుతున్నారు. దాంతో ”ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)” సినిమా మీద కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ తమ సినిమా అందుకుంటుందని చెబుతున్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ – 2018లో “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. 16 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది. ఒక అరుదైన సినిమా అని నమ్మాం కాబట్టే ఇన్నేళ్లు ట్రావెల్ చేశాం. జోర్డాన్, అల్జీరియా సహారా ఎడారిలో షూటింగ్ చేశాం. నజీబ్ క్యారెక్టర్ కోసం 31 కిలోల బరువు తగ్గాను. తీవ్రమైన చలిలో, వేడి వాతావారణంలో, బలమైన గాలులు వీచే వాతావరణంలో షూటింగ్ చేశాం. తెలుగులో మా సినిమాను మైత్రీ మూవీ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం మేము చాలా శ్రద్ధ తీసుకున్నాం. తెలుగు పాటల విషయంలో, డైలాగ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ సలార్ లో నన్ను ప్రేక్షకులు రాజమన్నార్ గా ఆదరించారు. ఇప్పుడు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాలో సలార్ కు పూర్తి భిన్నమైన క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశిస్తున్నా. సర్వైవల్ థ్రిల్లర్స్ ప్రేక్షకులకు తప్పకుండా ఆసక్తి కలిగిస్తాయి. ”ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)” ది బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మువీ. అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *